For Money

Business News

సిప్‌లలో నిధులు కుమ్మరిస్తున్నారు

బహుశా ఈక్విటీ మార్కెట్లు పడే కొద్దీ… మార్కెట్‌పై ఇన్వెస్టర్లకు నమ్మకం పెరుగుతున్నట్లు కన్పిస్తోంది. పడినపుడల్లా భలే మంచి చౌకబేరమని అనుకుంటున్నారేమో… పెట్టుబడి పెంచతుఉన్నారు. గత ఏడాది దసరా నుంచి ఈ ఏడాది దసరా వరకు నిఫ్టి 7 శాతం క్షీణించింది. అంటే దాదాపు చాలా వరకు మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్ల ప్రతిఫలాలు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి.కాని ఇన్వెస్టర్లు మాత్రం ప్రతి నెలా సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌)లో తమ పెట్టుబడులను పెంచుతూనే ఉన్నారు. గత సెప్టెంబర్‌లో సిప్‌ పెట్టుబడులు రూ. 12,976 కోట్లకు చేరాయి. ఒకనెలలో ఈ స్థాయిలో సిప్‌ పెట్టబడులు రావడం ఇదే మొదటిసారి. అంటే ఆల్‌టైమ్‌ హై అన్నమాట. ఆగస్టులో రూ. 12,693 కోట్లు పెట్టినట్లు అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (ఏంఎఎఫ్‌ఐ) పేర్కొంది. సిప్‌ ద్వారా పెట్టుబడులు పెడుతున్నవారి సంఖ్య కూడా 5.83 కోట్లకు చేరింది. సెప్టెంబర్‌లో వచ్చిన నికర ఈక్విటీ ఫండ్స్‌ విలువ రూ. 14,077 కోట్లు. దీంతో ఇపుడు మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్ల ఆధ్వర్యంలో నడుస్తున్న సిప్‌ పెట్టుబడుల మొత్తం రూ. 6.35 లక్షల కోట్లకు చేరింది.