For Money

Business News

సింగిల్‌ డిజిట్‌లోనే వృద్ధి

చూస్తుంటే డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కూడా ఎఫ్‌ఎంసీజీ రంగం నిరాశాజనక పనితీరు చూపించేలా ఉంది. గత త్రైమాసికంలో ఈ రంగానికి చెందిన కంపెనీలు నిరుత్సాహకర పనితీరు కనబర్చాయి. దీంతో ట్రెంట్, డిమార్ట్‌తో పాటు పలు ఎఫ్‌ఎంసీజీ షేర్లు భారీగా క్షీణించాయి. వీటిలో ట్రెంట్‌ కోలుకున్నా… డిమార్ట్‌ ఇవాళే పది శాతం సీలింగ్‌తో ఓపెన్‌ అయింది. తాజాగా డాబర్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు రాసిన లేఖలో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని పేర్కొంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ పనితీరులో వృద్ధి రేటు సింగిల్‌ డిజిట్‌లో ఉండే అవకాశముందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి బాగున్నా… పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం లేదని పేర్కొంది. సాధారణ మార్గాల్లో వ్యాపారం దెబ్బతింటోందని తెలిపింది. అయితే ఈ కామర్స్‌, క్విక్‌ కామర్స్‌ మార్గాల్లో వృద్ధి సంతృప్తికరంగా ఉందని పేర్కొంది. వెరశి ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంది.