లాభాల్లో సింగపూర్ నిఫ్టి
నిన్నటి భారీ నష్టాలతో తరవాత ఇవాళ మన మార్కెట్లు గ్రీన్‌లో ప్రారంభమయ్యే అవకాశముంది. రాత్రి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు తరవాత వాల్‌స్ట్రీట్ భారీ లాభాలతో ముగిసింది. అదే ఉత్సాహం ఆసియా మార్కెట్లలో లేకున్నా.. మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్ మార్కెట్లకు సెలవు. న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా మార్కెట్లు 0.6 శాతం లాభపడగా… చాలా రోజుల తరవాత ప్రారంభమైన చైనా మార్కెట్లు ఒక శాతం వరకు లాభపడ్డాయి. ఇక హాంగ్‌సెంగ్ కూడా ఇదే స్థాయి లాభాలతో ట్రేడవుతోంది. తైవాన్ కూడా. ఇక సింగపూర్ నిఫ్టి ఇవాళ 150 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఈ లెక్కన నిఫ్టి 16800పైన ప్రారంభమయ్యే అవకాశముంది.