For Money

Business News

లాభాల్లో సింగపూర్‌ నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నిన్న ఆరంభం నుంచి లాభాల్లో ఉన్న సూచీలో మిడ్‌సెషన్‌ తరవాత ఆకర్షణీయ లాభాలు గడించాయి. అన్ని సూచీలు 1.6 శాతంపైగా లాభాలతో ముగిశాయి. అయితే డాలర్, క్రూడ్‌లలో ఏమాత్రం వీక్‌నెస్‌ కన్పించడం లేదు. డాలర్‌ 97.50ని కూడా దాటేసింది. ఇక క్రూడ్‌ ఆయిల్‌ 2011 తరవాతి 117 డాలర్లకు దాటింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ, ఆస్ట్రేలియా సూచీలు అరశాతంపైన లాభంతో ట్రేడవుతున్నాయి. మిగిలిన సూచీల లాభాలన్నీ అరశాతం లోపలే ఉన్నాయి. ముఖ్యంగా చైనా మార్కెట్లతో పాటు హాంగ్‌సెంగ్‌ సూచీల్లో పెద్ద జోష్‌ లేదు. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి కూడా కేవలం 40 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. మార్కెట్‌ ప్రారంభ సమయానికి ఇదే స్థాయిలో ఉంటుందా లేదా మరింత బలపడుతుందా అన్నది చూడాలి.