For Money

Business News

స్వల్ప నష్టాల్లో సింగపూర్ నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లలో వచ్చిన అమ్మకాల ఒత్తిడి ప్రపంచ మార్కెట్లను మళ్ళీ నిస్తేజపరిచాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ళ గరిష్ఠస్థాయికి చేరింది. దీంతో మార్కెట్లకు మళ్ళీ వడ్డీ రేట్ల భయం పట్టుకుంది. డాలర్ స్వల్పంగా పెరిగింది. అలాగే బాండ్స్‌పై ఈల్డ్‌ కూడా పెరిగింది. దీంతో ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. జపాన్‌ నిక్కీ రెండు శాతం నష్టపోగా చైనా మార్కెట్ ఒక శాతంపై నష్టపోయింది. హాంగ్‌సెంగ్‌ మూడు శాతం క్షీణించడంతో ఆసియా మార్కెట్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. సింగపూర్‌ నిఫ్టి ఇపుడు 42 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఈ లెక్కన నిఫ్టి స్వల్ప నష్టంతో లేదా స్థిరంగా ప్రారంభం కానుంది.