స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
గత శుక్రవారం వాల్‌స్ట్రీట్ గ్రీన్‌లో ముగిసింది. అన్ని సూచీలు ఒక శాతం దాకా లాభం పొందాయి. ముఖ్యంగా డౌజోన్స్ ఒక శాతంపైగా లాభపడటం విశేషం. డాలర్ కూడా స్థిరంగా ఉంది. కాని బ్రెంట్ క్రూడ్ ఆయిల్ మళ్ళీ 110 డాలర్లను దాటింది. బంగారం కూడా స్వల్పంగా కోలుకని 1800 డాలర్లను దాటింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. చైనా, హాంగ్ కాంగ్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా హాంగ్‌సెంగ్ 0.76 శాతం నష్టపోయింది. తైవాన్ కూడా రెడ్‌లో ఉంది. అయితే జపాన్ నిక్కీ అరశాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా మార్కెట్లు ఒక శాతం పైగా లాభంతో ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 30 పాయింట్ల నష్టంతో ఉంది. సో… నిఫ్టి స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.