స్థిరంగా సింగపూర్ నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ప్రారంభమైనా.. క్లోజింగ్ సమయానికల్లా నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే గత కొన్ని రోజుల నష్టాలతో పోలిస్తే మార్కెట్ ఉపశమనం లభించినట్లే. నిన్న అమెరికా వెల్లడించిన ద్రవ్యోల్బణ రేటు మార్కెట్ వర్గాలు ఆశించిన స్థాయిలోనే ఉంది. మార్కెట్ అర శాతం వడ్డీ పెంపును ఇప్పటికే డిస్కౌంట్ చేసింది. ఫెడరల్ రిజర్వ్ కామెంటరీ కోసం మార్కెట్ ఎదురు చూస్తోంది. ఆసియా మార్కెట్లు మిశ్రంగా ఉన్నాయి. నిన్న భారీ లాభాలతో ముగిసిన చైనా, హాంగ్‌సెంగ్ సూచీలు ఇవాళ నష్టాల్లో ఉన్నాయి. అయితే నష్టాలు నామ మాత్రంగానే ఉన్నాయి. జపాన్ నిక్కీ 1.6 శాతం లాభపడగా, ఆస్ట్రేలియా 0.3 శాతం, తైవాన్ 1.3 శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 12 పాయింట్ల లాభంతో ఉంది. సో… నిఫ్టి స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది.