సింగపూర్ నిఫ్టి… అదే జోష్
నిన్న మార్కెట్ ప్రారంభానికి ముందు సింగపూర్ నిఫ్టి 250 పాయింట్ల లాభంతో ఉంది. ఇవాళ కూడా అదే స్థాయి లాభాలతో ఉంది. వడ్డీ రేట్ల అనిశ్చితి తొలగడంతో పాటు రష్యా, ఉక్రెయిన్ యుద్ధ చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయనే వార్తలతో ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు లాభాలతో హోరెత్తి పోతున్నాయి. హాంగ్‌సెంగ్ 4 శాతంపైగా లాభంతో ట్రేడవుతుండగా, జపాన్ నిక్కీ మూడు శాతం లాభంతో ఉంది. మొన్నటి దాకా డల్‌గా ఉన్న చైనా మార్కెట్లన్నీ రెండు శాతందాకా లాభంతో ట్రేడవుతున్నాయి. క్రూడ్ వంద డాలర్ల లోపుకు రావడం, డాలర్ కూడా స్థిరంగా ఉండటంతో మార్కెట్లు దూసుకుపోతున్నాయి. సింగపూర్ నిఫ్టి జోరు చూస్తుంటే నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 17000 స్థాయిని దాటనుంది.