16,500 దిగువన సింగపూర్ నిఫ్టి
కోవిడ్ సమయంలో వచ్చిన ఫ్రీక్యాష్‌తో పరుగులు తీసిన షేర్ మార్కెట్‌కు ద్రవ్యల్బోణం బ్రేక్ వేసింది. ప్రపంచ మార్కెట్లలో ముఖ్యంగా అమెరికాలో ఈ కరెక్షన్ ఎప్పటి నుంచో మొదలైంది. నాస్‌డాక్ బేర్ ఫేజ్‌లోకి వచ్చి రెండు వారాలు దాటింది. ఫెడ్ నిర్ణయం తరవాత బ్యాంక్, బాండ్ ఈల్డ్స్ పరుగులతో ఈక్విటీ మార్కెట్‌లో భారీ ఒత్తిడి వచ్చింది. 2020 తరవాత కనిష్ఠ స్థాయికి నాస్‌డాక్ క్షీణించింది. అమెరికా మార్కెట్ పతనం ప్రభావం ఆసియా మార్కెట్లలో కన్పిస్తోంది. జపాన్ నిక్కీ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని సూచీలు రెండు శాతం దాకా నష్టపోయాయి. హాంగ్‌సెంగ్ మూడు శాతం నష్టపోయింది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి కూడా 273 పాయింట్లు క్షీణించి 16417 వద్ద ట్రేడవుతోంది. ఈ లెక్కన నిఫ్టి భారీ నష్టాలతో ప్రారంభం కానుంది.