భారీ నష్టాల్లో సింగపూర్ నిఫ్టి
ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల హోరు కొనసాగుతోంది. గత శుక్రవారం అమెరికా మార్కెట్ల పతన ప్రభావం ఇవాళ ఆసియా మార్కెట్లలో కన్పిస్తోంది. గత శుక్రవారం వాల్‌స్ట్రీట్‌లో మూడు సూచీలూ 2.5 శాతం నుంచి 3 శాతం మధ్యలో నష్టపోయాయి. ఇపుడు కూడా అమెరికా ఫ్యూచర్స్ 0.75 శాతం నష్టంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లలలో అమ్మకాల హోరు కొనసాగుతోంది. ప్రధాన మార్కెట్లన్నీ రెండు శాతంపైగా నష్టంతో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ సూచీ 2.55 శాతం నష్టంతో ట్రేడవుతోంది. చైనాలో అనేక నగరాలకు కరోనా విస్తరిస్తోంది.దీంతో చైనా మార్కెట్లలోనూ ఒత్తిడి కన్పిస్తోంది. తైవాన్, కోప్సి వంలి మార్కెట్లు రెండు శాతం దాకా నష్టంతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 194 పాయింట్ల నష్టంతో ఉంది. సో.. నిఫ్టి చాలా వరకు 17000 దిగువన ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.