For Money

Business News

భారీ నష్టాల్లో సింగపూర్‌ నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో క్లోజ్‌ కాగా, ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఉక్రెయిన్‌లో అణు విద్యుత్‌ ప్లాంట్‌పై రష్యా దాడులు చేసిందన్న వార్తలతో మార్కెట్లు భారీ కుదుపుకు గురయ్యాయి. అయితే అణు ప్లాంట్‌కు ఎలాంటి నష్టం లేదని స్పష్టం కావడంతో స్వల్పంగా కోలుకున్నాయి. అయినా జపాన్‌ నిక్కీ 1.6 శాతం, హాంగ్‌సెంగ్‌ 2 శాతం, చైనా A50, కొప్సి సూచీలు అర శాతం కంటే అధిక నష్టంతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి కూడా భారీ నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇపుడు స్వల్పంగా కోలుకున్నా 250 పాయింట్ల నష్టంతో సింగపూర్‌ నిఫ్టి ట్రేడవుతోంది. నిఫ్టి నష్టాలతో ప్రారంభం కావడం ఖాయంగా కన్పిస్తోంది.