నష్టాల్లో సింగపూర్ నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. మూడు ప్రధాన సూచీలు 1.5 శాతం నష్టంతో ముగిశాయి. ముఖ్యంగా డౌజోన్స్ సూచీ కూడా ఈ స్థాయి నష్టాల్లో క్లోజ్ కావడం విశేషం. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. చైనా మార్కెట్లు మాత్రం గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.77 శాతం నష్టంలో ఉండగా, హాంగ్‌సెంగ్ 1.38 శాతం నష్టంతో ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లతో డైరెక్ట్‌గా లింక్ ఉన్న ఈ రెండు మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. చైనా మార్కెట్లలో చైనా A50 సూచీ ఒక శాతంపైగా లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 120 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సో… ఏప్రిల్ సిరీస్ నష్టాలతో ప్రారంభం కానుంది.