For Money

Business News

రూ. 2600 తగ్గిన వెండి ధర

అంతర్జాతీయ మార్కెట్‌లో ఇవాళ బులియన్‌ ధరలు తగ్గాయి. అమెరికాలో ఇవాళ వచ్చిన నాన్‌ఫామ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ డేటా అంచనాల మేరకు లేకపోవడంతో డాలర్‌ మినహా అన్ని మార్కెట్లు క్షీణించాయి. స్టాక్‌ మార్కెట్‌తో పాటు బులియన్‌, క్రూడ్‌ మార్కెట్లలో పతనం తీవ్రంగా ఉంది. అమెరికా బులియన్‌ మార్కెట్‌ ఔన్స్‌ బంగారం ధర 25 డాలర్లు తగ్గి 2518 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే వెండిలో మాత్రం పతనం తీవ్రంగా ఉంది. వెండి ధర మూడు శాతంపైగా క్షీణించింది. దీని ప్రభావంతో ప్రపంచ మార్కెట్లలో బులియన్‌ ధరలు భారీగా తగ్గాయి. మన దేశంలో స్పాట్‌ మార్కెట్‌లో బులియన్‌ ధరల్లో పెద్దగా మార్పులు లేకున్నా… ఎంసీఎక్స్‌లో మాత్రం వీటి పతనం తీవ్రంగా ఉంది. ఎంసీఎక్స్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో కిలో వెండి (డిసెంబర్‌ కాంట్రాక్ట్‌) రూ. 2600 పైగా తగ్గి రూ. 82,344ని తాకింది. ఇపుడు రూ. 82,370 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఫ్యూచర్‌ మార్కెట్‌లో (అక్టోబర్‌ కాంట్రాక్ట్‌) రూ. 600పైగా తగ్గి ఇపుడు రూ.71,316 వద్ద ట్రేడవుతోంది.

Leave a Reply