For Money

Business News

రూ. 20,000 తగ్గిన వెండి

పశ్చిమాయ యుద్ధం దెబ్బకు బులియన్‌ ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రధానంగా డాలర్‌ తగ్గినా మన మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. దీనికి మరో కారణం డాలర్‌తో రూపాయి బలహీనపడటం. అమెరికా మార్కెట్‌లో వెండి పది శాతం క్షీణించింది. అలాగే బంగారం 6 శాతం దాకా క్షీణించింది. మన మార్కెట్లలోనూ పతనం కొనసాగుతోంది. అయితే బంగారం మరీ పడకుండా ఒక మోస్తరు నష్టాలతో ఉంది. MCXలో కిలో బంగారం మే నెల కాంట్రాక్ట్‌ ఇవాళ రూ. 20,000లకు పైగా తగ్గి రూ. 2,28,000 వద్ద ట్రేడవుతోంది. ఇక బంగారం కూడా రూ. 7705 తగ్గింది. ప్రస్తుతం పది గ్రాముల ఏప్రిల్‌ నెల కాంట్రాక్ట్‌ రూ. 1,50,000 దిగువకు పడిపోయింది. ఇపుడు రూ. 1,45,403 వద్ద ట్రేడవుతోంది.

Leave a Reply