For Money

Business News

షారుక్‌ నెట్‌వర్త్‌ రూ. 7,300 కోట్లు

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ రూ. 7,300 కోట్ల నెట్‌వర్త్‌తో బాలీవుడ్‌లో నంబర్‌ వన్‌ కోటీశ్వరుడుగా రికార్డు సాధించాడు. ఆయన తొలిసారి హురూన్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇటీవల వరుస హిట్‌లు కొట్టిన షారుక్‌ ఖాన్‌కు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌లోని వాటా కూడా కలిసి వచ్చింది. పలు సినిమాలు తీయడంతో పాటు గ్రాఫిక్‌ వర్క్‌ చేస్తున్న ఆయన సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఇటీవల బాగా రాణించింది. ఈ నిర్మాణ సంస్థ తీసిన పఠాన్‌, జవాన్‌ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్‌ సాధించాయి. ప్రపంచ మార్కెట్‌లో ఈ రెండు సినిమాలు రూ. 2000 కోట్లకుపైగా బిజినెస్‌ చేశాయి. అలాగే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఐపీఎల్‌లో బాగా రాణించడంతో బ్రాండ్ విలువ బాగా పెరిగింది. హరూన్‌ జాబితాలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మరో భాగస్వామి జుహీ చావ్లా కూడా ఉన్నారు. ఇంకా హృతిక్‌ రోషన్‌, అమితాబ్‌, కరణ్‌ జోహార్‌ టాప్‌-5లో నిలిచారు. జూహీ చావ్లా, ఆమె కుటుంబ సభ్యుల సంపద రూ. 4,600 కోట్లు కాగా, హృతిక్‌ రోషన్‌ నెట్‌వర్త్‌ రూ. 2000 కోట్లుగా హురూన్‌ వెల్లడించింది. అమితాబ్‌ బచ్చన్‌ నెట్‌వర్త్ రూ. 1,600 కోట్లు. ఇదే జాబితాలో రూ. 1,400 కోట్ల నెట్‌వర్త్‌తో కరణ్‌ జోహర్‌ టాప్‌ 5లో నిలిచారు.