భారీ లాభాల్లో సింగపూర్ నిఫ్టి
అమెరికా మార్కెట్లు రాత్రి స్థిరంగా ముగియడంత ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. చాలా రోజుల తరవాత జపాన్ నిక్కీ రెండు శాతం, హాంగ్‌సెంగ్ సూచీ1.9 శాతం చొప్పున లాభాలతో ట్రేడవుతున్నాయి. చైనా మార్కెట్లు కూడా ఒక శాతం దాకా లాభంతో ట్రేడవుతున్నాయి. అన్ని మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి కూడా 150 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతోంది. ఇవాళ్టి నుంచి కొత్త వీక్లీ సెటిల్‌మెంట్ కూడా ప్రారంభం కానుంది. అయితే నిన్న వచ్చిన ద్రవ్యోల్బణ రేటు ప్రభావం మార్కెట్‌పై ఎలా ఉంటుందో చూడాలి.