దిమ్మ తిరిగే రికవరీ
వాల్స్ట్రీట్లో ఈ స్థాయి రికవరీ ఇటీవల ఎన్నడూ చూడలేదు. ఐటీ, టెక్ షేర్లలో వచ్చిన అమ్మకాల ఒత్తిడితో నాస్డాక్ ఏకంగా నాలుగు శాతం క్షీణించింది. 13094కు క్షీణించిన నాస్డాక్ రికార్డు స్థాయిలో మొత్తం నష్టాలను అంటే 4 శాతం నష్టాలను రికవర్ చేసుకుని… 0.63 శాతం లాభంతో ముగిసింది. ఏకంగా 750 పాయింట్లకు పైగా కోలుకుని 13876 వద్ద ముగిసింది. అలాగే ఎస్ అండ్ పీ కూడా భారీ నష్టాల నుంచి తేరుకుని స్వల్ప లాభంతో ముగిసింది. డౌజోన్స్ కూడా. దిగువ స్థాయిలో మార్కెట్కు మద్దతు అందింది. అలాగే క్రిప్టో కరెన్సీలకు కూడా కాని. డాలర్ మాత్రం తగ్గేదే లేదు అన్నట్లు లాభాల్లోనే కొనసాగుతోంది. 96ను దాటేందుకు డాలర్ ఇండెక్స్ రెడీగా ఉంది. స్టాక్ మార్కెట్ కోలుకోవడంతో క్రూడ్ ఆయిల్ కూడా కోలుకుని మళ్ళీ 86 డాలర్లకు చేరుకుంది. కాని… నిరాశకల్గించే వార్త ఏమిటంటే… అమెరికా ఫ్యూచర్స్ మళ్ళీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.