For Money

Business News

షేర్‌ చాట్‌ చేతికి ఎంఎక్స్‌ టకాటక్‌

షేర్‌  ఛాట్‌ తన ప్రత్యర్థి, టైమ్స్‌ గ్రూప్‌ చెందిన ఎంఎక్స్‌ షాట్ వీడియో ప్లాట్‌ ఫామ్‌ టకాటక్‌ను టేకోవర్‌ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 70 కోట్ల డాలర్లకు అంటే రూ. 5,250 కోట్లకు ఈ డీల్ కుదురుతోందని తెలుస్తోంది. 2020లో చైనాకు చెందిన టిక్‌టాక్‌ను భారత్ నిషేధించడంతో… వెంటనే షేర్‌ చాట్‌ మాతృ సంస్థ మొహల్లా టెక్‌ కంపెనీ ‘మోజ్‌’ అనే షార్ట్‌ వీడియో షేరింగ్‌ యాప్‌ను ప్రారంభిచింది. ఆదరణ బాగా లభించడంతో తక్కువ కాలంలోనే 16 కోట్ల సబ్‌స్క్రయిబర్స్‌ చేరారు. అయితే టైమ్స్‌ గ్రూప్‌కు చెందిన ఎంఎక్స్ టకాటక్‌ను టేకోవర్‌ చేయాలని మొహల్లా టెక్‌ చర్చలు ప్రారంభించింది. డీల్‌ కుదరినట్లు రాయిటర్స్‌ వార్త సంస్థ అంటోంది. కొంత వాటాల రూపంలో, మిగిలినది నగదు రూపంలో ఇచ్చేలా డీల్‌ కుదిరింది. ప్రస్తుతం షేర్‌ చాట్‌ విలువ రూ. 30,000 కోట్లుగా లెక్కిస్తున్నారు. ఇందులో ట్విటర్‌తో పాటు సింగపూర్‌కు చెందిన టెమాసెక్‌ కూడా పెట్టుబడి పెట్టింది.