For Money

Business News

శరత్‌కు మూడు కంపెనీలు

అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ శరత్‌చంద్రా రెడ్డి ఇప్పటి వరకు తమ సొంత కంపెనీ ట్రైడెంట్‌ కెంఫర్‌ లిమిటెడ్‌ ద్వారా మద్యం వ్యాపారం చేసినట్లు వార్తలు వచ్చినా… అవంతిక కాంట్రాక్టర్స్‌ లిమిటెడ్‌, ఆర్గనోమిక్స్‌ ఎకోసిస్టమ్స్‌ లిమిటెడ్‌ పేర్లతో కూడా ఈయనే మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తన చార్జిషీటులో పేర్కొంది. ఈ మూడు కంపెనీలకు అయిదు జోన్లు దక్కాయని… వీటికి సంబంధించిన రిటైల్‌ కార్యకలాపాలను అభిషేక్‌ బోయినపల్లి నడిపారు. ఈడీ దాఖలు చేసిన 181 పేజీలలో శరత్‌ చంద్రారెడ్డి కంపెనీల మధ్య జరిగిన లావాదేవీలను ఈడీ ప్రస్తావించింది. ఇండోస్పిరిట్స్‌ కంపెనీ ద్వారా శరత్‌ చంద్రా రెడ్డి కంపెనీలకు 7 సార్లు భారీ మొత్తంలో క్రెడిట్‌ నోట్లు జారీ చేసినట్లు చార్జిషీటులో ఈడీ పేర్కొంది. 2021 సెప్టెంబరు 20న సౌత్‌గ్రూపు కోసం పెర్నార్డ్‌ రికార్డు తరఫున ఏర్పాటు చేసిన విందుకు సమీర్‌ మహేంద్రు, శరత్‌ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి హాజరయినట్లు ఈడీ పేర్కొంది.