For Money

Business News

శంకర్‌ శర్మ ఈ షేర్లు కొన్నారు

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ శంకర్‌ శర్మ తాజాగా ఇషాన్‌ డైస్‌ అండ్‌ కెమికల్స్‌ కంపెనీలో 7 లక్షల షేర్లు కొనుగోలు చేశారు. రూ. 121.71 ధర వద్ద ఆయన ఈ షేర్లను కొనుగోలు చేశారు. మొత్తం డీల్‌ విలువ రూ. 8.52 కోట్లు. స్పెషాలిటి కెమికల్స్‌ కంపెనీలు గత కొన్నేళ్ళుగా అద్భుతంగా రాణిస్తున్నాయి. ప్రమోటర్‌ అయితన పియూష్‌భాయ్‌ నట్వర్‌లాల్‌ పటేల్‌ నుంచి శంకర్‌ శర్మ 2 లక్షల షేర్లు కొన్నారు. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రమోటర్లకు ఈ కంపెనీలో 58.52 శాతం వాటా ఉంది. నిన్న ఈ షేర్‌ 14.70 శాతం లాభంతో రూ. 138.50 వద్ద ముగిసింది. అంతకుముందు రూ.142ను తాకింది.ఈ ధర వద్ద చూస్తే కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 221 కోట్లకు చేరింది. ఈ షేర్‌ 12 నెలల పీఈకి 14.91 రెట్ల వద్ద ట్రేడవుతోంది.