For Money

Business News

షాడోఫాక్స్ ఐపీఓ వస్తోంది

వివిధ ఈ కామర్స్‌ కంపెనీలకు లాజిస్టిక్‌ సర్వీసులు అందిస్తున్న కంపెనీ షాడోఫాక్స్‌ త్వరలోనే పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. ఈ మేరకు వచ్చే వారం సెబీ వద్ద ఈ కంపెనీ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనుంది. అయితే కాన్ఫిడెన్షియల్‌ పద్ధతిలో ప్రాస్పెక్టస్‌ దాఖలు చేస్తుంది. ఈ తరహా పద్దతిలో కంపెనీకి చెందిన చాలా వరకు సమాచారాన్ని కంపెనీ రహస్యంగా ఉంచుతుంది. తరువాతి దశల్లో విడతలవారీగా బహిర్గతం చేస్తుంది. మార్కెట్‌ నుంచి రూ. 2500 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. కంపెనీ వ్యాల్యూయేషన్‌ రూ. 8500 కోట్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా ఉన్న ఇన్వెస్టర్లు తమ వాటాలో కొంత భాగాన్ని అమ్ముతుండగా, తాజాగా కూడా కొన్ని షేర్లను జారీ చేస్తారు. 2015లో ప్రారంభమైన ఈ కంపెనీలో ఫ్లిప్‌కార్ట్‌, టీపీజీ, ఎయిట్‌ రోడ్స్‌ వెంచర్స్‌, మిరాయే అసెట్‌ వెంచర్స్‌తో పాటు పలు ఫండ్స్‌కు వాటాలు ఉన్నాయి.