షాడోఫాక్స్ టెక్ వస్తోంది
న్యూఏజ్ రంగానికి చెందిన మరో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు రెడీ అవుతోంది. మార్కెట్ నుంచి రూ. 2000 కోట్ల సమీకరణకు షాడోఫాక్స్ టెక్నాలజీస్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఈ కామర్స్, క్విక్ కామర్స్ కంపెనీలకు థర్డ్ పార్టీ లాజిస్టిక్ సేవలు అందించే ఈ కంపెనీ రూ. 1000 కోట్లను తాజా షేర్ల జారీ ద్వారా, మరో రూ. 1000 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అమ్మనుంది. సమీకరించే రూ. 1000 కోట్లలో రూ. 423 కోట్లు మూలధన వ్యయం కోసం ఖర్చు చేయాలని భావిస్తోంది. 2025 సెప్టెంబర్ నెలాఖరుకు అంటే ప్రమార్థంలో రూ. 1805 కోట్ల ఆదాయాన్ని ఈ కంపెనీ ఆర్జించింది. ఎబిటా మార్జిన్ 2.86 శాతంగా ఉంది.
