For Money

Business News

ఆకర్షణీయ లాభాల్లో SGX నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో ముగిశాయి. నాస్‌డాక్‌ 1.62 శాతం లాభంతో క్లోజ్‌ కాగా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.95 శాతం లాభపడింది. ఇక డౌజోన్స్ 0.64 శాతం లాభంతో ముగిసింది. రాత్రి అమెరికా డాలర్‌ స్వల్పంగా పెరిగినా… బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గడం ఈక్విటీ మార్కెట్‌కు ప్లస్‌గా మారింది. అలాగే బ్రెంట్ క్రూడ్‌ ధరలు కూడా 110 డాలర్ల దిగువకు రావడంతో పాజిటివ్‌ సంకేతం. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో ట్రేడవుతున్నాయి. చైనా మార్కెట్లు అర శాతం వరకు లాభపడగా.. హాంగ్‌సెంగ్‌, తైవాన్‌ సూచీలు 1.5 శాతం దాకా లాభంతో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ కూడా 0.7 శాతం లాభంతో ఉంది. సింగపూర్‌ నిఫ్టి కూడా 95 పాయింట్లు లాభపడింది. సో… నిఫ్టి ఆకర్షణీయ లాభాంతో ప్రారంభం కావొచ్చు.