జోష్‌లో ఆసియా మార్కెట్లు
రాత్రి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ఫెడ్ వడ్డీ రేట్లకు సంబంధించి క్లారిటీ రావడంతో మార్కెట్ లాభాల్లో ముగిసింది. నాస్డాక్ 2.68 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 2 శాతం, డౌజోన్స్ 1.6 శాతం చొప్పున లాభాల్లో ముగిశాయి. డాలర్ క్రమంగా బలహీనపడుతోంది. ఇపుడు డాలర్ ఇండెక్స్ 102 దిగువకు వచ్చేసింది. బాండ్ ఈల్డ్స్ నుంచి కూడా పెద్ద ఒత్తిడి లేదు. టెస్లా, అమెజాన్, యాపిల్ వంటి షేర్లు రెండు నుంచి నాలుగు శాతం వరకు పెరిగాయి. వాల్‌స్ట్రీట్ జోష్ ఆసియా మార్కెట్లలో కూడా కన్పిస్తోంది. అన్ని మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. అత్యధికంగా హాంగ్‌కాంగ్ సూచీ 3.22 శాతం లాభంతో ట్రడేవుతోంది. కోస్పి, నిక్కీ, ఆస్ట్రేలియా తదితర మార్కెట్లు ఒక శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. మన మార్కెట్లలో కూడా ఇవాళ పాజిటివ్ ట్రెండ్ ఉండే అవకాశుముంది. సింగపూర్ నిఫ్టి 80 పాయింట్ల లాభంతో ఉంది.