For Money

Business News

భారీ లాభాల్లో సింగపూర్ నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్సాహం కొనసాగుతోంది. నిన్న యూరో మార్కెట్లు, రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల్లో క్లోజ్‌ కాగా… ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. చైనా, హాంగ్‌కాంగ్ మార్కెట్లు రెండు శాతంపైగా లాభాల్లో ట్రేడవుతుండగా, జపాన్‌ నిక్కీ మాత్రం ఏకంగా 3.75 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఇక చిన్న మార్కెట్లు కూడా 1.5 శాతంపైగా లాభంతో ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి కూడా 300 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ స్వల్ప లాభంతో ఉండటా,ముఖ్యంగా క్రూడ్‌ ఆయిల్‌ 130 డాలర్ల నుంచి 110 డాలర్లకు పడటం మన మార్కెట్లకు అనుకూల అంశాలు. సో… నిఫ్టి కనీసం 250-300 పాయింట్ల లాభంతో ఓపెన్‌ అయ్యే అవకాశముంది.