For Money

Business News

SGX నిఫ్టి: 150 పాయింట్లు అప్‌

రాత్రి అమెరికా మార్కెట్లు మంచి జోష్‌తో ముగిశాయి. డాలర్‌ క్షీణించడం, బాండ్‌ఈల్డ్స్‌ తగ్గడంతో వాల్‌స్ట్రీట్ భారీ లాభాల్లో ముగిసింది. మైక్రోసాఫ్ట్‌ గైడెన్స్‌ తగ్గించినా.. రాత్రి ఐటీ షేర్లలో గట్టి మద్దతు లభించింది. నాస్‌డాక్‌ 2.68 శాతం లాభంతో ముగిసింది. ఇక ఎస్‌ అండ్‌ పీ 500 కూడా 1.84 శాతం, డౌజోన్స్‌ కూడా 1.33 శాతం లాభంతో ముగిశాయి. అమెరికాలో వారాంతపు చమురు నిల్వలు అనూహ్యంగా క్షీణించడంతో రాత్రి క్రూడ్‌ ఆయిల్‌ మళ్ళీ పుంజుకుంది. ఇపుడు 117 డాలర్లపైనే ఉంది. ఇక ఆసియా మార్కెట్లలో కీలక మార్కెట్లకు ఇవాళ సెలవు. చైనా, హాంగ్‌ మార్కెట్లు ఇవాళ పనిచేయడం లేదు. ఇక జపాన్‌ నిక్కీ ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ మార్కెట్లు కూడా 0.7 శాతంపైగా లాభంతో ఉన్నాయి. సింగపూర్‌ నిఫ్టి ప్రస్తుతం 150 పాయింట్ల లాభంతో ఉంది. సో…నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభం కానుంది.