లాభాల్లో సింగపూర్ నిఫ్టి
గత శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఆరంభం నుంచి లాభాల్లోఉన్న మార్కెట్లు ట్రేడింగ్ కొనసాగే కొద్దీ బలపడ్డాయి. ముఖ్యంగా టెక్ షేర్లకు ఆకర్షణీయ మద్దతు లభించింది. నాస్డాక్ దాదాపు 4 శాతం లాభపడగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 2.4 శాతం లాభంతో ముగిసింది. ఒక డౌజోన్స్ సూచీ 1.5 శాతం లాభపడింది. అమెరికా మార్కెట్ల ఉత్సాహం ఇవాళ ఆసియాలో కొనసాగుతోంది. జపాన్ నిక్కీ, హాంగ్సెంగ్లు ఒక శాతం లాభంతో ట్రేడవుతున్నాయి.చైనా మార్కెట్లు గ్రీన్లో ఉన్నా లాభాలు స్వల్పమే. సింగపూర్ నిఫ్టి ప్రస్తుతం 120 పాయింట్ల లాభంతో ఉంది. గత శుక్రవారం మన మార్కెట్లు గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 350 పాయింట్లు క్షీణించి ఇన్వెస్టర్లకు ఇచ్చింది. ఇవాళ మాత్రం గ్రీన్లో ప్రారంభం కానుంది.