For Money

Business News

స్వల్ప నష్టాల్లో సింగపూర్ నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లకు మళ్ళీ వడ్డీ పెంపు భయం పట్టుకుంది. రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ మళ్ళీ పెరగడంతో పాటు అమెరికా ప్రభుత్వ బాండ్లపై ఈల్డ్స్‌ భారీగా పెరగడంతో డౌజోన్స్‌ 1.15 శాతం క్షీణించింది. అలాగే ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా ఒక శాతం నష్టంతో ముగిసింది. ఇప్పటికే భారీ క్షీణించినందున నాస్‌డాక్‌ 0.63 శాతం నష్టంతో ముగిసింది. గత కొన్ని నెలలుగా కాస్త పటిష్టంగా ఉన్న డౌజోన్స్‌ సూచీ ఇపుడు బలహీనపడుతోంది. అంతకుముందు యూరో మార్కెట్లు కూడా దాదాపు ఒక శాతం నష్టంతో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. చైనా మార్కెట్లకు ఈ వారమంతా సెలవు. జపాన్‌ నిక్కీతో పాటు ఇతర మార్కెట్లు అరశాతం కంటే అధిక నష్టంతో ట్రేడవుతున్నాయి. హాంగ్‌సెంగ్‌ ఒక శాతం నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 36 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. కొత్త వీక్లీ సెటిల్‌మెంట్‌ ఇవాళ్టితో ప్రారంభం కానుంది.అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్‌ ఆయిల్‌ భారీగా పెరిగి 94 డాలర్లకు పెరిగింది. ఇది కూడా మన మార్కెట్లపై ప్రభావం చూపనుంది. సో.. నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప నష్టాలతో ప్రారంభం కానుంది.