For Money

Business News

స్వల్ప నష్టాల్లో SGX NIFTY

మధ్యంతర ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి కొనసాగుతుండగా వాల్‌స్ట్రీట్‌ భారీ నష్టాల్లో ముగిసింది. మూడు ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. మూడు సూచీలు రెండు శాతం నష్టపోయాయి. నాస్‌డాక్‌ 2.48 శాతం తగ్గింది. డౌజోన్స్‌లో నష్టాలు మార్కెట్‌ విశ్లేషకులను ఆశ్చర్చపర్చింది. చట్ట సభల్లో పట్టు కోసం రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. డాలర్‌ స్థిరంగా ఉంది. రాత్రి క్రూడ్‌ ధరలు తగ్గాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 92.5 డాలర్ల ప్రాంతంలో ఉంది. దాదాపు ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లోఉన్నాయి. చైనా మార్కెట్లు ఒకశాతం నష్టపోగా, హాంగ్‌సెంగ్‌ రెండు శాతం క్షీణించింది.చాలా వరకు మార్కెట్లు ఒక శాతంపైగా నష్టంతో ఉన్నా… సింగపూర్ నిఫ్టి 50 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టి స్వల్ప నష్టాలతో ప్రారంభం కావొచ్చు. ఇవాళ డెరివేటివ్స్‌ వీక్లీ సెటిట్‌మెంట్‌ ఉంది.