నష్టాల్లో సింగపూర్ నిఫ్టి
నిన్న ఉదయం ఆసియాతో మొదలైన షేర్ల పతనం రాత్రి అమెరికా మార్కెట్లతో ఆగినట్లు కన్పిస్తోంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నా… నిన్నటి నష్టాలతో పోలిస్తే తక్కువే అని చెప్పొచ్చు. ఒక్క హాంగ్‌సెంగ్ తప్ప మిగిలిన మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. జపాన్ నిక్కీ అరశాతం నష్టపోగా, చైనా మార్కెట్లు కూడా అరశాతంపైనే నష్టపోయాయి. భారీ నష్టాలతో తరువాత అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉన్నాయి. కాని స్వల్ప లాభాలే. మరి అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లోకి వస్తాయా లేదా ఆసియా మార్కెట్లు గ్రీన్‌లోకి వస్తాయా అన్నది చూడాలి. సింగపూర్ నిఫ్టి ఇవాళ కూడా 90 పాయింట్ల నష్టంతో ఉంది. మరి మార్కెట్ ఓపెనింగ్ సమయానికి సింగపూర్ నిఫ్టి కోలుకుంటుందా లేదా అన్నది చూడాలి. నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.