100 లాభంతో సింగపూర్ నిఫ్టి
ప్రపంచ మార్కెట్లు స్థిరంగా గ్రీన్‌లో ఉన్నాయి. రాత్రి అమెరికా స్వల్ప లాభాల్లో క్లోజ్ కాగా, ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లోఉన్నాయి. నిక్కీ స్వల్ప నష్టాల్లో ఉండగా, హాంగ్‌సెంగ్ ఒక శాతం నష్టంతో ట్రేడవుతోంది.తైవాన్ మాత్రం అర శాతం లాభంతో ఉంది. చైనా మార్కెట్లకు ఇవాళ కూడా హాలిడే. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి గ్రీన్‌లో ఉంది. తాజా సమాచారం మేరకు సింగపూర్ నిఫ్టి 100 పాయింట్లు లాభంతో ఉంది. నిన్న మన మార్కెట్లకు సెలవు. సో.. నిన్న ప్రపంచ మార్కెట్ల లాభాలను SGX నిఫ్టి చూపుతోంది. నిఫ్టి లాభాలతో ప్రారంభం కానుంది. సోమవారం ప్రపంచ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నా..మన మార్కెట్లు నామమాత్రపు నష్టాలతో ముగిశాయి. సో… ఇవాళ కూడా అదే ట్రెండ్ కొనసాగుతుందా అన్నది చూడాలి.