స్థిరంగా సింగపూర్ నిఫ్టి
మైక్రోసాఫ్ట్ ఫలితాలు అంచనాలు తప్పడంతో రాత్రి అమెరికా భారీ నష్టాలతో ముగిశాయి. గూగుల్ ఫలితాలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోయినా.. గూగుల్ సెర్చ్ యాడ్స్ ఆశాజనకంగా ఉండటంతో ఆ షేర్ రెండు శాతం పెరిగింది. మార్కెట్ ముగిసిన తరవాత మైక్రసాఫ్ట్ కంపెనీ షేర్ పెరిగింది. కంపెనీ గైడెన్స్‌ను పెంచడమే దీనికి కారణం. రాత్రి నాస్డాక్ 1.87 శాతం క్షీణించగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 1.15 శాతం పడిపోయింది. రాత్రి క్రూడ్ ధరలు భారీగా పెరగడంతో ఎనర్జీ రంగానికి చెందిన షేర్లు పెరిగాయి. దీంతో డౌజోన్స్ నష్టాలు 0.71 శాతానికి పరిమితమయ్యాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. జపాన్ నిక్కీ క్రితం ముగింపు వద్దే ఉంది. నిన్న రెండు శాతం దాకా పెరిగిన హాంగ్‌సెంగ్ ఇవాళ ఒక శాతం నష్టంతో ఉంది. మిగిలిన మార్కెట్లు అంతంత మాత్రమే. సింగపూర్ నిఫ్టి కూడా కేవలం పాతిక పాయింట్ల లాభంతో ఉంది. అమెరికా ఫ్యూచర్స్ అరశాతంపైగా గ్రీన్‌లో ఉన్నందున.. మన మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.