For Money

Business News

స్థిరంగా సింగపూర్ నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఈవారంలో ప్రధాన టెక్‌ కంపెనీలు ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రంగానికి చెందిన షేర్లపై ఒత్తిడి వస్తోంది. అయితే యూరప్‌కు గ్యాస్‌ సరఫరాలో రష్యా కోత పెట్టింది. దీంతో నేచురల్‌ గ్యాస్‌ ధరలు రాత్రి అమాంతంగా పెరిగాయి. క్రూడ్‌ ధరలు కూడా పెరిగాయి. దీంతో ఎనర్జీ షేర్లు రాత్రి భారీ లాభాలతో ముగిశాయి. దీంతో డౌజోన్స్‌ 0.28 శాతం, ఎస్‌ అండ్ పీ 50 సూచీ 013 శాతం లాభంతో క్లోజ్‌ కాగా, నాస్‌డాక్‌ మాత్రం 0.43 శాతం నష్టంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్‌ మిశ్రమంగా ఉన్నా.. మెజారిటీ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ చాలా స్వల్పంగా 0.2 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇక హాంగ్సెంగ్‌ 0.33 శాతం లాభంతో ఉంది.చైనా మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ మళ్ళీ 100 డాలర్లకు చేరువ అవుతోంది. దీనికి ప్రధాన కారణం యూరప్‌లో రష్యా నుంచి సరఫరా తగ్గడంతో పాటు డాలర్ బలహీనపడటం. సింగపూర్ నిఫ్టి పాతిక పాయింట్ల నష్టంతో ఉంది. ఈ లెక్కన నిఫ్టి స్థిరంగా ప్రారంభం కానుంది.