స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లు నిన్న భారీ నష్టాలతో ముగిశాయి. రాత్రి కూడా అమెరికా మార్కెట్లు ఒక శాతం వరకు నష్టపోయాయి. నాస్డాక్ 1.33 శాతం నష్టపోయింది. అంతక్రితం యూరో మార్కెట్లు దాదాపు రెండు శాతం వరకు నష్టపోయాయి. రాత్రి అమెరికాలో ఈక్విటీ, కరెన్సీ, బాండ్ ఈల్డ్స్, క్రూడ్, బులియన్ అన్నీ నష్టాలతో ముగిశాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో కూడా నష్టాలే కన్పిస్తున్నాయి. హాంగ్కాంగ్ మార్కెట్లకు ఇవాళ సెలవు. జపాన్ నిక్కీ 1.23 శాతం నష్టంతో ఉంది. చైనా మార్కెట్లలో పెద్ద మార్పులేదు. క్రితం ముగింపు వద్దే ఉన్నాయి. తైవాన్, కోప్సి మార్కెట్లలో ఒత్తిడి అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి కేవలం 20 పాయింట్ల నష్టంతో ఉంది. సో నిఫ్టి స్థిరంగా లేదా ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభం కానుంది.