స్థిరంగా సింగపూర్ నిఫ్టి
క్రిస్మస్ సందర్భంగా రాత్రి అమెరికా మార్కెట్లకు సెలవు. యూరప్‌లో కూడా ప్రధాన మార్కెట్లు పనిచేయలేదు. అమెరికా ఫ్యూచర్స్ మాత్రం ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. సూచీలు 0.7 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. డాలర్ ఇండెక్స్ మళ్ళీ 104 దిగువకు వచ్చేసింది. మరోవైపు క్రూడ్ ధరలు దూసుకుపోతున్నాయి. బ్రెంట్ క్రూడ్ 85 డాలర్లను దాటింది. ఇక ఆసియా మార్కెట్లన్నీ ఉదయం నుంచి లాభాల్లో ఉన్నాయి. హాంగ్ కాంగ్ మార్కెట్‌కు ఇవాళ కూడా సెలవు. అయితే చైనా మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. ఇక జపాన్ నిక్కీ ఒక శాతంపైగా లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి స్థిరంగా ట్రేడవుతోంది. నిన్న భారీ లాభాలతో తరవాత ఇవాళ ప్రస్తుతం 30 పాయింట్ల లాభంతో ఉంది.