For Money

Business News

స్థిరంగా SGX NIFTY

నిన్న భారీ లాభాలతో ముగిసిన భారత మార్కెట్లు ఇవాళ స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. రాత్రి అమెరికా మార్కెట్లు తీవ్ర ఒడుదుడుకులకు లోనయ్యాయి. ఆరంభంలో నష్టాల్లోకి జారుకున్నా.. తరవాత లాభాల్లోకి వచ్చాయి. చివరికి మూడు ప్రధాన సూచీలు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్ పీ 500, డౌజోన్స్‌ సూచీలు ఒక శాతంపైగా లాభపడగా, నాస్‌డాక్‌ 0.86 శాతం లాభపడింది. డాలర్‌ స్వల్పంగా క్షీణించగా. పదేళ్ళ ప్రభుత్వ బాండ్‌ ఈల్డ్స్‌ 4.2 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లు నిన్నటి భారీ నష్టాల నుంచి ఇంకా కోలుకోలేదు. అన్నీ రెడ్‌లో ఉన్నా… నామమాత్రంగా ఉండటం ఊరట కల్గించే అంశం. అమెరికా మార్కెట్లతో ముడిపడిన పలు ఇతర మార్కెట్లు దాదాపు ఒక శాతం లాభంతో ఉన్నాయి. సింగపూర్‌ నిఫ్టి 15 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టి ప్రారంభ సమయానికి లాభాల్లోకి రావొచ్చు.