స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
మొత్తానికి అమెరికా మార్కెట్‌లో అమ్మకాల హోరు ఆగింది. రాత్రి లాభాల్లో ప్రారంభమైన వాల్‌స్ట్రీట్ … తరవాత నష్టాల్లో జారుకున్నా… క్లోజింగ్‌కల్లా నష్టాలను తగ్గించుకుంది. అన్ని సూచీలు దాదాపు క్రితం ముగింపుస్థాయిల వద్దే ముగిశాయి. కరెన్సీ మార్కెట్‌లో డాలర్ ఇంకా బలపడుతోంది. డాలర్ ఇండెక్స్ 101ను ఇవాళ దాటే అవకాశముంది. క్రూడ్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. సెలవు తరవాత ఇవాళ ప్రారంభమైన హాంగ్‌సెంగ్ మూడు శాతం వరకు నష్టంతో ఉంది. అయితే చైనా మార్కెట్లలో ఎలాంటి ఒత్తిడి లేదు. రెడ్‌లో ఉన్నా నామ మాత్రమే. ఇక జపాన్ నిక్కీ గ్రీన్‌లో ఉంది.ఆస్ట్రేలియా గ్రీన్లో ఉండగా, న్యూజిల్యాండ్ నష్టాల్లో ఉంది. సింగపూర్ నిఫ్టి ఇవాళ స్థిరంగా ఉంది. 30 పాయింట్ల లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభమయ్యే అవకాశముంది. మైండ్‌ట్రీ ఫలితాలు మిడ్‌క్యాప్ ఐటీ కంపెనీలపై ప్రభావం చూపే అవకాశముంది.