స్థిరంగా SGX NIFTY
రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. మిడ్ సెషన్‌తో పోలిస్తే క్లోజింగ్ సమయంలో ఇన్వెస్టర్లు స్వల్ప లాభాలు స్వీకరించారు. దీంతో నిఫ్టి స్వల్ప లాభాలతో ముగిశాయి. నాస్డాక్1.45 శాతం లాభంతో ముగియగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.87 శాతం లాభపడింది. డౌజోన్స్ లాభాలు మాత్రం 0.17శాతానికి పరిమితమయ్యాయి. రాత్రి డాలర్ స్థిరంగా ఉంది. అలాగే క్రూడ్ కూడా. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. చాలా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్, తైవాన్ మార్కెట్లు గ్రీన్‌లో ఉండగా జపాన్,చైనా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఇక సింగపూర్ నిఫ్టి 35 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఓపెనింగ్ సమయానికి నిఫ్టి స్థిరంగా ప్రారంభం కావొచ్చు.