18000 దాటిన నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా అమెరికా మార్కెట్లు దుమ్మ రేపుతున్నాయి. టెక్, ఐటీ షేర్ల సూచీలు భారీగా క్షీణించడంతో గత శుక్రవారం దిగువ స్థాయిలో గట్టి మద్దతు లభించింది. ఐటీ, టెక్ షేర్లతో పాటు ఎకనామీ షేర్లు కూడా భారీగా పెరిగాయి. రేపు, ఎల్లుండి అమెరికా ఫెడ్ మార్కెట్ భేటీ అవుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా సూచీల కదలికలు మన మార్కెట్లకు కూడా కీలకం కానున్నాయి. శుక్రవారం అప్‌ట్రెండ్ ఇవాళ ఆసియా మార్కెట్లలో కన్పిస్తోంది. అమెరికాతో ముడిపడిన దేశాల సూచీలు ఒక శాతంపైగా పెరిగాయి. జపాన్ నిక్కీ 1.6 శాతం పైగా పెరిగింది. అయితే చైనా మాన్యూఫ్యాక్చరింగ్ యాక్టివిటి తగ్గడంతో ఆ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ సూచీలో ఎలాంటి మార్పు లేదు. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్ నిఫ్టి 18000పైన ట్రేడవుతోంది. ఈ సూచీ ఒక శాతం లాభంతో ఉంది. సో నిఫ్టి కనీసం 150 పాయింట్ల లాభంతో ప్రారంభం కావొచ్చు.