స్వల్ప లాభాల్లో సింగపూర్ నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు అద్భుతంగా కోలుకున్నాయి. నిన్న మిడ్ సెషన్ వరకు భారీ నష్టాల్లో ఉన్న వాల్‌స్ట్రీట్… క్లోజింగ్ కల్లా గ్రీన్‌లోకి వచ్చేసింది. ముఖ్యంగా ఐటీ, టెక్ షేర్లకు గట్టి మద్దతు లభించింది. నాస్డాక్ 1.75 శాతం లాభపడగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.16 శాతం లాభంతో ముగిశాయి. రాత్రి క్రూడ్ భారీగా క్షీణించడంతో ఎనర్జీ షేర్లపై ఒత్తిడి పెరిగింది. గ్రోత్ షేర్లలో కూడా అమ్మకాలు పెరిగాయి. దీంతో డౌజోన్స్ 0.42 శాతం నష్టంతో ముగిశాయి. డాలర్ ఇండెక్స్ రాత్రి 1.5 శాతం పెరిగి 106ని దాటింది. రాత్రి 8 శాతం పడిన క్రూడ్ ఇపుడు స్వల్పంగా కోలుకుంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ 104 డాలర్ల వద్ద ఉంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.33 శాతం నష్టపోగా, హాంగ్‌సెంగ్ 0.6 శాతం నష్టపోయింది.చైనా సూచీలు అర శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ 40 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టి స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది.