17800పైన సింగపూర్ నిఫ్టి
నిన్న మార్కెట్ల సెలవు తరవాత ఇవాళ గ్రీన్లో ప్రారంభం కానుంది. రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్లో ముగిశాయి. ఆరంభంలో అన్ని ప్రధాన సూచీలు రెడ్లో ఉన్నాయి. కాని ట్రేడింగ్ కొనసాగే కొద్దీ బలపడి లాభాల్లోకి వచ్చాయి. నాస్డాక్ 0.62 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.4 శాతం, డౌజోన్స్ సూచీ 0.45 శాతం లాభంతో ముగిశాయి. అంతకుమంఉదు యూరో మార్కెట్లు కూడా ఇదే స్థాయి లాభాలతో ముగిశాయి. డాలర్ నిన్న రాత్రి బాగా బలపడింది. డాలర్ ఇండెక్స్ ఇపుడు 106పైన ఉంటోంది. ఇక నిన్న భారీ నష్టాలతో ముగిసిన ఆసియా మార్కెట్లు ఇవాళ గ్రీన్లో ఉన్నాయి. నిన్న వచ్చిన చైనా ఆర్థిక డేటా చాలా నిరాశాజనకంగా ఉండటంతో చైనాతో పాటు హాంగ్కాంగ్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. చైనా ఎకనామి నిస్తేజంగా ఉందని డేటా చెబుతుండటంతో ఆయిల్ భారీగా క్షీణించింది. నిన్న దాదాపు 5 శాతం క్షీణించిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఇపుడు 94 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక నష్టాల్లో ముగిసిన ఆసియా మార్కెట్లన్నీ ఇవాళ గ్రీన్లో ఉన్నాయి. అన్నీ నామ మాత్రపు లాభాలే. ఏదీ కనీసం పావు శాతం కూడా లాభపడలేదు. సింగపూర్ నిఫ్టి 60 పాయింట్ల లాభంతో 17800పైన ట్రేడవుతోంది. సో.. నిఫ్టి కూడా గ్రీన్లో ప్రారంభం కానుంది.