లాభాల్లో SGX Nifty
రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. ఆరంభంలో నష్టాల్లోఉన్న సూచీలన్నీ మిడ్ సెషన్‌కల్లా గ్రీన్‌లోకి వచ్చాయి. తరవాత ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ఆరంభం నుంచి నాస్డాక్ ఒకశాతం లాభంతో ఉంది. ఎస్ అండ్ పీ 500 సూచీ క్రమంగా బలపడుతూ దాదాపు ఒక శాతం లాభంతో ముగిసింది. ఇక ఆరంభం నుంచి నష్టాల్లో ఉన్న డౌజోన్స్ చివర్లో కోలుకుని అరశాతం లాభంతో ముగిసింది. రాత్రి డాలర్ స్థిరంగానే ఉంది. అయితే డాలర్ ఇండెక్స్ 107 దిగువనే ఉంది. క్రూడ్ ధరలు రాత్రి మూడు శాతం దాకా తగ్గాయి. ఇపుడు గ్రీన్‌లో ఉన్నాయి. ఇక బులియన్ మార్కెట్లో దిగువస్థాయిలో మద్దతు అందింది. ఇక ఆసియా మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నా.. చాలా మార్కెట్లు నామమాత్రపు లాభాలతో కొనసాగుతున్నాయి. హాంగ్‌సెంగ్ 0.75 శాతం లాభంతో ఉంది. మిగిలిన మార్కెట్ల లాభాలన్నీ అర శాతం దిగువనే ఉన్నాయి. ఇక సింగపూర్ నిఫ్టి స్వల్ప లాభంతో ట్రేడవుతోంది. సో… నిఫ్టి గ్రీన్‌లో ఓపెన్ కానుంది.