లాభాల్లో SGX NIFTY
రాత్రి అమెరికా మార్కెట్‌లో భారీ లాభాల్లో ముగిశాయి. నాస్‌డాక్ ఏకంగా 3.43 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 2.65 శాతంతో పాటు డౌజోన్స్ 1.86 శాతం లాభంతో ముగిశాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్థిక ఫలితాలు మార్కెట్‌కు కొత్త జోష్‌ను తెచ్చాయి. డాలర్ ఇండెక్స్ 112 దిగువకు చేరింది. ఈక్విటీ మార్కెట్ పాజిటివ్‌గా ఉండటంతో క్రూడ్ కూడా స్థిరంగా ఉంది. ఈనేపథ్యంలో ఆసియా మార్కెట్లు కూడా చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.63 శాతం లాభంతో ఉంది. ఇదే స్థాయి లాభాలతో ఉన్న హాంగ్‌సెంగ్ క్రమంగా లాభాలను కోల్పోతోంది. చైనా మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నాఇ. అయితే షాంఘై సూచీ మాత్రం నష్టంతో ఉంది. మెజారిటీ ఆసియా మార్కెట్లు అర శాతంలోపు లాభాలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 135 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సో.. నిఫ్టి ఒక మోస్తరు లాభాలతో ప్రారంభం కానుంది.