లాభాల్లో సింగపూర్ నిఫ్టి
ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతోంది. గత శుక్రవారం మన మార్కెట్లకు సెలవు. ఆరోజు యూరో,అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా వాల్‌స్ట్రీట్‌లో నాస్‌డాక్ రెండు శాతంపైగా లాభంతో ముగిశాయి. ఇతర సూచీలు కూడా ఒక శాతం లాభంతో ముగిశాయి. ఇక ఆసియా మార్కెట్లు ఉదయం నుంచి గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్ మార్కెట్లకు ఇవాళ సెలవు. చైనా మార్కెట్లు అర శాతం వరకు లాభంతో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ మాత్రం దాదాపు క్రితం ముగింపు వద్దే ట్రేడవుతోంది. న్యూజిల్యాండ్ మార్కెట్ నష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి వంద పాయింట్లకు పైగా లాభంతో ఉంది. సో… నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప లాభాలతో ప్రారంభం కానుంది.