స్థిరంగా సింగపూర్ నిఫ్టి
రాత్రి వాల్‌స్ట్రీట్ మిశ్రమంగా ముగిసింది. ఇవాళ అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయం వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో అమెరికా మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. మొత్తానికి రాత్రి ఐటీ, టెక్ షేర్లలో అమ్మకాల హోరు ఆగింది. నాస్‌డాక్ 0.18 శాతం లాభంతో ముగిసింది. అయితే డౌజోన్స్ అరశాతం నష్టపోయింది. ఇక ఎస్ అండ్ పీ 500 సూచీ 0.38 శాతం నష్టంతో ముగిసింది. అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లోఉన్నందున ఆసియా మార్కెట్లు చాలా వరకు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ మాత్రం అర శాతంపైగా నష్టంతో ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ కూడా. చైనా, హాంగ్ కాంగ్, తైవాన్ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ 0.79 శాతం లాభంతో ఉంది. కోప్సి 0.88 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి నామమాత్రపు లాభాల్లో ఉంది. కేవలం 5 పాయింట్ల లాభంతో ఉంది. చూస్తుంటే నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప నష్టంతో ప్రారంభం కావొచ్చు.