నష్టాల్లో సింగపూర్ నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆరంభంలో ఒక శాతంపైగా లాభంలో ఉన్న వాల్‌స్ట్రీట్ తరవాత చాలా వరకు లాభాలను కోల్పోయింది. పరిమిత లాభంతో ముగిసింది. డౌజోన్స్‌లో దాదాపు మార్పు లేదు. ఎస్ అండ్ పీ 500 సూచీ 0.3 శాతం, నాస్‌డాక్ 0.4 శాతం లాబంతో ముగిశాయి. అయితే ఫ్యూచర్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. రాత్రి డాలర్ పెరగడంతో పాటు 10 ఏళ్ళ అమెరికా బాండ్స్‌పై ఈల్డ్స్ మళ్ళీ 3 శాతం దాటాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లలో తాజా పెట్టుబడులకు ఇన్వెస్టర్లు జంకుతున్నాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ, షాంఘై మార్కెట్లు అర శాతం లాభంతో ఉన్నాయి. మిగిలిన మార్కెట్ల లాభనష్టాలన్నీ నామ మాత్రంగానే ఉన్నాయి. హాంగ్‌సెంగ్ కూడా అంతే. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి ఆరంభంలో 150 పాయింట్ల నష్టంలో ఉంది. కాని సెషన్ కొనసాగే కొద్దీ నష్టాలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం 115 పాయింట్ల నష్టంతో ఉంది. సో… నిఫ్టి కూడా నష్టాలతో ప్రారంభం కానుంది.