For Money

Business News

నష్టాల్లో సింగపూర్ నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే సింగపూర్‌ నిఫ్టి కాస్త మెరుగ్గానే ట్రేడవుతోందని అనాలి. తాజా సమాచారం ప్రకారం నిఫ్టి 108 పాయింట్లు (0.68 శాతం) నష్టంతో ట్రేడవుతోంది. అమెరికాతోపాటు అనేక మార్కట్లు రెండు నుంచి నాలుగు శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్న సమయంలో సింగపూర్ నిఫ్టి ఈ స్థాయి నష్టాలకే పరిమితమైతే సంతోషం. అమెరికా భారీ సెల్‌ ఆఫ్‌ ప్రభావం ఆసియా మార్కెట్లపై కన్పిస్తోంది. నిన్న సెలవు తరవాత ఇవాళ ప్రారంభమైన హాంగ్‌సెంగ్ రెండు శాతం నష్టంతో ఉంది. జపాన్‌ నిక్కీ కూడా మరో శాతం నష్టంతో ఉంది. షాంఘై ఒక్కటే కాస్త గ్రీన్‌లో ఉంది. మిగిలిన మార్కెట్లన్నీ ఒక మోస్తరు నష్టాలతో ఉన్నాయి. ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌ నిన్నటితో పూర్తయింది. ఇవాళ రెండు పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. ఎల్ఐసీ ఇష్యూ కోసం అమ్మకాలు జరిపిన ఇన్వెస్టర్లు ఇవాళ్టి నుంచి సెకండీరీ మార్కెట్‌లో చురుగ్గా పాల్గొంటారా? అదే నిజమైతే నిఫ్టి బలంగా ఉండాలి. లేదా ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌ కోసం మార్కెట్‌ మరీ పడకుండా ఆపరేట్లర్లు కాపాడుతూ వచ్చారా అన్నది కూడా ఇవాళ తేలనుంది. కమాడిటీస్‌ ధరలు భారీగా క్షీణిస్తున్నాయి. రాత్రి క్రూడ్‌ ఆరు శాతం దాకా క్షీణించింది. మరి వీటిని మన మార్కెట్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి. నిఫ్టి రెడ్‌లో ప్రారంభమైనా… అక్కడి నుంచి కోలుకుంటుందా లేదా మరింత పతనమౌతుందా అన్నది చూడాలి.