నష్టాల్లో సింగపూర్ నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లన్నీ సెలవు మూడ్‌లో ఉన్నాయి. ప్రధాన మార్కెట్లన్నింటికి సెలవు. కేవలం కొన్ని మార్కెట్లు మాత్రమే పనిచేస్తున్నారు. గత శుక్రవారం కూడా మార్కెట్ చాలా డల్‌గా సాగింది. ట్రేడింగ్ అంతంత మాత్రమే. అమెరికా సూచీలు 2022 చివరి ట్రేడింగ్ సెషన్‌ను కూడా నష్టాలతో ముగించాయి. కాకపోతే నష్టాలు స్వల్పంగానే ఉన్నాయి. ఇక ఉదయం నుంచి దాదాపు అన్ని ఆసియా మార్కెట్లు సెలవు. దీంతో మనకు ఏ ప్రధాన ఇండికేటర్ల మద్దతు లేదు. ఇక సింగపూర్ నిఫ్టి స్వల్ప నష్టంతో ట్రేడవుతోంది. 40 పాయింట్ల నష్టంతో ఉంది. మన మార్కెట్లో కూడా ట్రేడింగ్ డల్‌గా ఉండే అవకాశముంది.