నష్టాల్లో సింగపూర్ నిఫ్టి
సింగపూర్ నిఫ్టి 80 పాయింట్ల నష్టంతో ఉంది. మార్కెట్ ప్రారంభమయ్యే సమయానికి ఈ నష్టాలు కాస్త తగ్గే అవకాశముంది. రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్ గ్రీన్‌లో ముగిసేందుకు ప్రయత్నించింది. కేవలం 0.11 శాతం లాభంతో ముగిసింది. టెక్ షేర్లలో మాత్రం ఒత్తిడి కొనసాగింది. ముఖ్యంగా టెస్లా కంపెనీ నాస్డాక్ సెంటిమెంట్‌ను దారుణంగా దెబ్బతీసింది. షాంఘైలోని ప్లాంట్ ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు టెస్లా ప్రకటించడంతో రాత్రి ఆ కంపెనీ షేర్ 12 శాతం దాకా క్షీణించింది. ఐటీ, టెక్ షేర్ల సెంటిమెంట్ దెబ్బతినడంతో ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 0.41 శాతం నష్టంతో ముగిసింది. డాలర్లో పెద్ద మార్పు లేదు. రాత్రి 86 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్ స్వల్పంగా తగ్గింది. అలాగే బులియన్ ధరలు కూడా. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. వరుస సెలవుల తరవాత ప్రారంభమైన హాంగ్‌కాంగ్ రెండు శాతం లాభంతో ఉంది. అయితే మిగిలిన మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.63 శాతం, తైవాన్ 0.73 శాతం, కోప్సి 1.98 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. చైనా మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నా… నష్టాలు అర శాతం కంటే తక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 80 పాయింట్ల నష్టంతో ఉంది. రేపు వీక్లీతో పాటు మంత్లీ కాంట్రాక్ట్‌ల క్లోజింగ్ ఉంది. సో… నిఫ్టిలో భారీ హెచ్చుతగ్గులు ఉండే అవకాశముంది.