For Money

Business News

150 పాయింట్ల నష్టంతో సింగపూర్‌ నిఫ్టి

అమెరికా మార్కెట్లకు అనుగుణంగా ఆసియా మార్కెట్లు ట్రేడవుతున్నాయి. అయితే చైనా మార్కెట్‌లో నష్టాలు అర శాతం ప్రాంతంలో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ 1.82 శాతం నష్టపోగా, హాంగ్‌సెంగ్‌ 0.88 శాతం నష్టంతో ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు నామ మాత్రపు లాభాల్లో ఉన్నాయి. దీంతో యూరో మార్కెట్ల ఓపెనింగ్‌ కీలకం కానుంది. మరోవైపు మెటల్స్‌ ధరలు మార్కెట్లను కలవర పెడుతున్నాయి. అలాగే క్రూడ్‌ కూడా. బ్రెంట్‌ క్రూడ్‌ ఇపుడు 110 డాలర్లను దాటింది. దీనికి మన మార్కెట్లు ఎలా రియాక్ట్‌ అవుతాయో చూడాలి. సింగపూర్ నిఫ్టి మాత్రం ఇపుడు 150 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టి కూడా ఇదే స్థాయి నష్టాలతో ప్రారంభమౌతుందేమో చూడాలి.